<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>238</hymn_number>
<title>మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట</title>
<lyrics>[C1]
   మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
   నా జీవిత ధన్యతై యున్నది
   మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట (2) // మహోన్నతుడా //

[V1]
 మోడుబారిన జీవితాలను
 చిగురింప జేయగలవు నీవు (2)
 మారా అనుభవం మధురముగా
 మార్చగలవు నీవు (2) // మహోన్నతుడా //

[V2]
 ఆకు వాడక ఆత్మ ఫలములు
 ఆనందముతో ఫలియించినా (2)
 జీవ జలముల ఊట అయిన
 నీ ఓరన నను నాటితివా (2) // మహోన్నతుడా //

[V3]
 వాడబారని స్వాస్థ్యము నాకై
 పరమందు దాచి యుంచితివా (2)
 వాగ్ధాన ఫలము అనుభవింప
 నీ కృపలో నన్ను పిలచితివా (2) // మహోన్నతుడా //</lyrics>
</song>